పిడుగుపాటుకు ముగ్గురి మృతి
మెదక్ జిల్లాలో తాతామనమళ్లు..
ఆరుగాలం కష్టించే రైతన్నకు అడుగడుగునా గండాలే. అందరి కడుపు నింపే ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకున్నా.. పిడుగు రూపంలో వచ్చిన మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయా డు. తాను పండించిన ధాన్యం కుప్పల వద్దే మనవడితోపాటు తనువు చాలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పిడుగుపడి తాత, మనువడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచే సుకుంది. పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామానికి చెందిన పాల్వం చ శ్రీరాములు (50), అతని మనువడు విశాల్ (11) ఐకేపీ సెంటర్‌లో ధాన్యం ఆరబోశారు.
ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడం తో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను కప్పడానికి వెళ్లారు. వర్షం క్ర మంగా పెరగడంతో వారు వరి కుప్పల వద్దనే నెత్తిపై సంచులు పెట్టుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో వారిపై పిడుగు పడింది. ఘటనలో తీవ్ర అస్వస్థతపాలైన తాత, మనవ డు అక్కడిక క్కడే మృతిచెందారు. దీంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నా యి. ఇద్దరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిమ్మ గ్రామంలో మరొకరు
ఆదిలాబాద్ జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కిరణ్ (42), భోజన్న, అడెల్లు, రమేష్, చంటెన్న పొలం పనులకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వాన మొదలై పిడుగుపడింది. ఘటనలో కూలీలందరూ అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను గ్రామస్తులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో కిరణ్ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు.
నర్సింగాపూర్‌లో ఆవు..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన పాడి రైతు పి.మల్లారెడ్డి కొట్టంపై ఆదివారం సాయంత్రం పిడుగుపడింది. ఘటనలో ఓ పాడి ఆవు మృతిచెందింది. సుమారు రూ.80 వేల విలువైన ఆవు మృతిచెందిందని బాధితుడు వాపోయాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలోని ఓ ఇంట్లో కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు అంటు కున్నాయి.




