calender_icon.png 22 January, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

03-10-2024 01:15:13 AM

సంగారెడ్డి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి పట్టణంలో 10.5 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. దీంతో మురికి కాల్వలు నిండి పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. సిద్దార్థ నగర్‌లో మురికి కాల్వను కొందరు ఆక్రమించడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చిందని కాలనీవాసులు పేర్కొన్నా రు. అదేవిధంగా వాగులు వరద నీటితో నిం డి ప్రవహించాయి. రోడ్లపై వరదనీరు ప్రవహించడంతో పలుచోట్ల వాహనాల రాకపో కలు నిలిచిపోయాయి. సోయా పంట మునిగిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది.