calender_icon.png 22 January, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి స్కాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

22-01-2026 03:04:21 AM

  1. అప్పడు స్కీములు.. ఇప్పుడు స్కాములు 
  2. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో సింగరేణిలో స్కాం 
  3. మంత్రులు తేలు కుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడం లేదు
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* సింగరేణి స్కాంపై మొత్తం మంత్రులు తేలుకుట్టిన దొంగల్లా కనీసం మాట్లాడం లేదు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయారు. నైనీ టెండర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటా లు పంచుకున్నారు.. అయితే నా సంగతేమిటని మరో మంత్రి కోమటిరెడ్డి అడగడంతో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ముఖ్యమంత్రి తన అనుకూల మీడియాలో ఆ ఇద్దరు మంత్రులపై కథనాలు రాయించారు. దీంతో అసలు స్కాం బయటపడింది. ఈ స్కాం బయటపడగానే కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారు.

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి) : సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూలేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక స్కాములకే కాంగ్రెస్ పాలన పరిమితమైందని విమర్శించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గుర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అస లు స్వరూపాన్ని బయటపెడుతోందని స్పష్టం చేశారు. ఈ అంశంపైన మొత్తం మంత్రులు తేలుకుట్టిన దొంగ ల్లా కనీసం మాట్లాడం లేదని ఆరోపించారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయాడన్నారు.

నైనీ టెండర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటాలు పంచుకున్నారని, అయితే నా సంగతేమిటని మరో మంత్రి కోమటి రెడ్డి అడగడంతో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ముఖ్యమంత్రి తన అనుకూల మీడియాలో వారి పై కథనాలు రాయించారని దీంతో అసలు స్కాం బయటపడిందని  కేటీఆర్ అన్నారు. ఈ స్కాం బయటపడ గానే కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారని, అయితే వారి మాటలు, మోసాలు స్కాంను దాచి ఉంచలేవన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు.

వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయని, ముఖ్యంగా సింగరేణి స్కామ్ తెలంగా ణ ప్రజల విశ్వాసానికి తూట్లు పొడుస్తోందని స్పష్టం చేశారు. ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ భారీ స్కామ్ బయటపడిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తీసుకువచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శిం చారు.

గతంలో దేశంలో ఎక్కడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా, ఇప్పుడు తప్పనిసరిగా సైట్?కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. 

వాటాల పంచాయితీ.. 

ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి బంధువుల పాత్రపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్‌రెడ్డి కంపెనీకే దక్కిం దని, రూ. 250 కోట్ల కాంట్రాక్ట్ అందుకున్నారని ఆరోపించారు. ఒక్కో టెండర్‌ను వాటా లు వేసుకుని మరీ పంచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ కాంగ్రెస్ నేత లు వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని, ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించగానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ఆరోపించారు. సింగరేణి స్కామ్‌పై సమాధానం చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ అంటూ టీవీ సీరియల్‌లా కేసులు లాగుతున్నారని విమర్శించారు. 

వాగ్దానాలు.. కలర్‌ఫుల్ ప్రచారం..

చెన్నూరులో వివేక్ మంత్రి అయ్యాక పరిశ్రమ పెట్టి 40- వేల మందికి ఉద్యోగా లు ఇస్తానని చెప్పారని, కానీ మూడేళ్లు గడిచినా 400 మందికైనా ఉద్యోగాలు ఇవ్వలే రని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలని, తులం బంగారం, స్కూటీ లు, డబుల్ పెన్షన్లు, రైతులకు 15 వేల రూపాయలు వంటి వాగ్దానాలు కేవలం కలర్‌ఫుల్ ప్రచారమేనని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్డు చూపించి ఇచ్చిన హామీలన్నీ నేడు గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. 

కేంద్రం దివాళాకోరు విధానం

ఈ స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంద న్న కేంద్ర మంత్రి వాదన దివాళాకోరు విధానానికి నిదర్శనం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన ముఖ్యమంత్రి తానే సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ కాదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి తో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. 10 శాతం ప్లస్ ధరలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న ఈ దుర్మార్గం కేంద్ర మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.