29-10-2025 08:03:57 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): మొంథా తుఫాన్ ఉదయం నుండి వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురవడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ముఖ్యంగా హనుమకొండ బస్టాండు ప్రాంతాలలో రహదారులపై నీరు నిలవడంతో ప్రయాణికులు, వాహనదారులకు అంతరాయం కలిగింది. పలు కాలనీలలో మోకాళ్ళ లోతు నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో చిన్నపిల్లలు, పెద్దలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయము కలిగింది. ఈ భారీ వర్షంతో పలు కాలనీలోని ప్రజలు విలవిలాడుతున్నారు.