29-10-2025 08:05:11 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): అక్రమ కట్టడాల కట్టడికి మున్సిపాలిటీ అధికారులు మున్సిపల్ పరిధిలో సరైన అనుమతులు లేని కట్టడాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం పట్టణంలోని పలు వార్డ్ లలో మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది సరైన అనుమతులు లేని పలు కట్టడాలను గుర్తించారు. పలు వార్డ్ లలో పురపాలికకు పన్ను చెల్లించకుండా సరైన అనుమతులు లేని భవన నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. గడువులోపు సంబంధిత అనుమతులు తీసుకోకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలుంటాయిని కమీషనర్ పేర్కొన్నారు.