29-10-2025 08:19:49 PM
మల్యాల ఎస్సై నరేష్ కుమార్..
మల్యాల (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తీవ్రత దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్యాల ఎస్సై నరేష్ కుమార్ సూచించారు. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, మత్తళ్లు దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు. రోడ్లపై గుంతలు గమనించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అవసరమైతే డయల్ 100 ను సంప్రదించాలని ఎస్ఐ నరేష్ తెలిపారు.