calender_icon.png 30 October, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక పట్టివేత.. లారీ సీజ్

29-10-2025 08:30:20 PM

గంభీరావుపేట క్రైమ్ (విజయక్రాంతి): అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని గంభీరావుపేట పోలీసులు బుధవారం సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలాగందుల గ్రామానికి చెందిన మల్లేశం తన లారీలో (టీఎస్ 02 యుబి 7377) దొంగతనంగా ఇసుక నింపుకొని, కామారెడ్డిలో అధిక ధరకు విక్రయించడానికి వెళ్తుండగా, గంభీరావుపేట మండల పరిధిలోని ఆర్ఆర్ నగర్ కాలనీలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు లారీని పోలీస్ స్టేషన్ కు తరలించగా, లారీని సీజ్ చేసి లారీ యజమాని, డ్రైవర్ అయిన మల్లేశంపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్సై గూడ దేవేందర్ రెడ్డి తెలిపారు.