29-10-2025 08:42:46 PM
సిద్దిపేట క్రైమ్: ఈ నెల 30న సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు.