29-10-2025 08:40:12 PM
కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా మొంథా తుఫాను(Cyclonic Storm Montha) ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, హన్మకొండ కలెక్టర్ సూచనమేరకు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా విద్యాశాఖాధికారి అక్టోబర్ 30న సెలవు ప్రకటించారు. అదేవిధంగా రేపు జరగాల్సిన సమ్మేటివ్ పరీక్షలు, 3-5 తరగతులకు ఈవీఎస్, 6, 7 తరగతులకు జనరల్ సైన్స్, 8, 9, 10 తరగతులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నవంబర్ 1, 2025న జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 31న జరగనున్న పరీక్షలు, షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని డీఈఓ తెలియజేశారు.