29-10-2025 08:46:12 PM
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
- మండలంలో విస్తృత పర్యటన.
- మద్దెల కుమారస్వామి మృత దేహానికి నివాళులు, కుటుంబానికి పరామర్శ.
- రాష్ట్ర స్థాయి అండర్ 17 క్రీడల ఏర్పాట్లు పరిశీలన.. అధికారులతో సమీక్ష.
- రైతులతో కలిసి ధాన్యం ఆరబోత యంత్రం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే.
- కస్తూర్భా పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు.. మెనూ అమలుపై విద్యార్థుల నుంచి ఆరా.
- సీతంపేట, బోటిగూడెం గ్రామాల నుండి 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక.
- 27 మంది లబ్దిదారులకు రూ 27,00,430 విలువ గల చెక్కులు పంపిణీ.
పినపాక (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అమలులో భాగంగా సంక్షేమ పథకాలను ప్రతి పేద ఇంటికి చేరవేస్తోందని, పేదోళ్ల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా నిలుస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మల్లారం గ్రామానికి చెందిన మద్దెల కుమారస్వామి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల సమాఖ్య అండర్ 17 క్రీడల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను ముమ్మరం చేయాలని, శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే రైతు నూతనంగా తీసుకొచ్చిన పచ్చి వరి ధాన్యాన్ని గంటల వ్యవధిలో ఆరబెట్టే యంత్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. రైతులు సద్వినియోగం చేసుకుని, భారీ వర్షాలకు, మొంత తుఫాన్ నుంచి పంటలు కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఎల్చిరెడ్డిపల్లి లోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
అనంతరం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం సమక్షంలో సీతంపేట, బోటుగూడెం గ్రామాల నుంచి సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 27 మంది లబ్ధిదారులకు రూ 27,00,430 లక్షల విలువ గల చెక్కులు అందించి, ప్రభుత్వం అందించిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పేదల ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.
కార్యక్రమంలో తహశీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో పోటు సంకీర్త్, ఎంపీ ఓకే వెంకటేశ్వరరావు, ఎంఈఓ కే నాగయ్య, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు తోలం కళ్యాణి, కొరసా కృష్ణంరాజు, పోతినేని శివశంకర్, మాజీ ఎంపిటిసి పొనగంటి శివకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకట్ రెడ్డి జి శ్రీనివాస్ రెడ్డి, దాట్లరాజేష్, బోడ రమేష్, పోలిశెట్టి హరీష్, పొనుగోటి చందర్ రావు, ఉడుముల రవీందర్ రెడ్డి, కొండేరు సంపత్, బండారు సాంబ కృష్ణమూర్తి ఆరె నవీన్, కొడెం రామ్మోహన్, బిళ్ళం సాంబశివరావు, కేతా ప్రసాద్, పిట్టల సురేష్, మద్దెల సమ్మయ్య, తోలెం అర్జున్, పొనగంటి శ్రీను, సింహాద్రి మనోజ్, చీకటి సత్యనారాయణ, బుచ్చిబాబు, బతకయ్య, వార శంకర్ తదితరులు పాల్గొన్నారు.