calender_icon.png 30 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

29-10-2025 08:36:18 PM

తాండూరు (విజయక్రాంతి): రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కురువ లక్ష్మణ్@ లక్కీ(24) నేడు గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ హిందూ ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగిన ముందుండేవాడని గ్రామస్తులతో.. యువకులతో కలిసిమెలిసి అందరితో కలివిడిగా ఉండేవాడని.. అతడి మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.