calender_icon.png 22 May, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాల కొరతను అరికట్టాలి

21-05-2025 07:57:05 PM

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): జీలుగు, జనుము లాంటి పచ్చి రొట్ట విత్తనాలు రేటు అధికంగా పెంచడం, వర్షాలు  ముందుగానే కురియడంతో విత్తనాల కొరత ఇల్లందు మండలంలో అధికంగా ఉందని ఇల్లందు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా బావ్ సింగ్ నాయక్ అన్నారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి వచ్చాయని వాటిని నిరోధించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఇల్లందు మండల రైతు నాయకుల ఆధ్వర్యంలో ఇల్లందు వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందింజేశారు. ఈ సందర్భంగా అజ్మీరా బావ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ... జీలుగు, జనుము లాంటి పచ్చిరొట్ట విత్తనాలు పోయిన సంవత్సరం కంటే అధిక ధరకు వ్యవసాయ శాఖ విక్రయించడం చాలా దారుణం అన్నారు. 

పచ్చిరొట్ట విత్తనాలు వేసి భూమిని, ప్రకృతిని కాపాడాలని ప్రోత్సహించే ప్రభుత్వాలే ఇలా అధిక ధరలకు విత్తనాలు అమ్మడం శోచనీయం అన్నారు. అలాగే నకిలీ విత్తనాల భారి నుండి రైతులను కాపాడాలని కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నకిలీ విత్తనాలను అరికట్టి రైతుల బతుకులు ఆగం కాకుండా ఆదిలోనే కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాసాని హరిప్రసాద్ యాదవ్, భూక్యా సురేష్, ధారావత్ రమేష్, భూక్యా హుస్సేన్, అజ్మీరా రాందాస్, బోడ రమేష్, అజ్మీరా చినబాబు, ఉపేందర్ రావు, వార రమేష్, అజ్మీరా మంజి, లక్ష్మీనారాయణ, లావుడియ శంకర్, భూక్యా రాంజీ, మంగీలాల్ గూగులోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.