calender_icon.png 22 May, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది

21-05-2025 07:48:55 PM

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు..

మునుగోడు (విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకు వెళుతుందని పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆయన ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాజీవ్ గాంధీ ఆధునిక భారతదేశానికి పితామహుడు అని, 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు అని తెలిపారు.

శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో మృతి చెందడం బాధాకరమన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి రోజైన మే 21 నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. రాజీవ్ గాంధీ కలలు, దృష్టి, ఆయన నిబద్ధత భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా మార్చాయి అని తెలిపారు. సాంకేతికత, టెలికాం, వికేంద్రీకరణపై అతని విప్లవాత్మక ఆలోచనలు భారతదేశ ముఖచిత్రాన్ని మార్చాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దోటి నారాయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, మిర్యాల వెంకన్న, పాలకూరి యాదయ్య, కుంభం చెన్నారెడ్డి, హైమద్, పందుల భాస్కర్, అన్వర్, సాగర్ల లింగస్వామి, పాల్వాయి జితేందర్, పందుల నరసింహ, జిట్టగోని యాదయ్య, సింగం గిరి, జాల మని, సాయి, ఉదయ్, ప్రభాకర్, ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.