calender_icon.png 22 May, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, భూక్య జాన్సన్ నాయక్ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మలేషియా బాధితులు

21-05-2025 07:40:03 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడెం, దస్తురాబాద్ మండల గ్రామాలకు చెందిన మలేషియా జైలు బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్(BRS constituency in-charge Bhukya Johnson Naik) సహకారంతో ఎట్టకేలకు బాధితుల స్వగ్రామం చేరుకున్నారు.

ఇటీవల కాలంలో మలేషియా దేశంలో అకారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నరేష్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన రవీందర్లు, ఆ దేశంలో జైలు శిక్ష అనుభవిస్తూ బాధపడుతున్న తరుణంలో జాన్సన్ నాయక్, కేటీఆర్ సహాయంతో బుధవారం వారు జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే వారు కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ ను కలిసి వారి సహాయం ఎల్లప్పుడూ మర్చిపోమని, జీవితాంతం రుణపడి ఉంటామని వారు కుటుంబ సభ్యులతో పాటు కన్నీటి పర్యంతమయ్యారు.