calender_icon.png 20 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిది దేవాలయాల్లో చోరీ

20-08-2025 12:54:09 AM

విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి.జానకి

భూత్పూర్ ఆగస్టు 19  : ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డి జానకి చెప్పారు. మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దేవాలయాల్లో హుండీలలో వేసిన డబ్బులను చోరీలు చేస్తూ నిందితుడు తప్పించుకుని తిరుగుతున్న తరుణంలో సీసీ కుంట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.

చోరీలకు పాల్పడిన వ్యక్తి కరుణాకర్ వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన వారిని ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవారు అని తెలిపారు.  మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా లలో  8 దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 3,96, 200లను, 2 మోటార్ సైకిళ్లు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

గ్రామాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల ముందుకు రావాలని కోరారు. ఈ కేసును ఛేదించడంలో  కృషి చేసిన సీసీ కుంట ఎస్త్స్ర రామ్ లాల్, నిరంజన్ రెడ్డి, విష్ణు, బాల్ రెడ్డి,రవి, లని జిల్లా ఎస్పీ  ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు.