calender_icon.png 25 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల మధ్యలోని మురుగునీరును తొలగించండి

25-09-2025 12:44:24 AM

మాగనూరు .సెప్టెంబర్, 24.మాగ నూరు మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో ఇం డ్ల మధ్య వర్షం నీరు , మురుగునీరు ఆగడం వల్ల కాలనీలోని ఇండ్లకు వెళ్లే రహదారులు నీటితో నిండడం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడుతుందని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల గ్రామంలోని అంతర్గత రహదారుల పైనుంచి నీరు రావడం జరుగుతుందన్నారు.

చిన్నపాటి వర్షం వచ్చిన ఇండ్ల మధ్యలోనే నీరు నిలువ ఉండి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో నీరు నిల్వ ఉండడం వల్ల విషసర్పాలు,ఈగలు ,దోమలు, ఎక్కువ అవుతున్నాయి, ఈగలు దోమల వల్ల రోగాల బారిన పడవలు చూస్తుందని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి ఇండ్ల మధ్యలో నిలిచిన మురుగునీటిని తొలగించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను గ్రామస్తులుకోరుతున్నారు.