15-08-2025 05:56:10 PM
సంగెం- కోడూరు మధ్య తిమ్మాపురంకు రాకపోకలు బంద్...
సంగెం- వెంకేపల్లి మధ్య నూతనకల్ కు రాకపోకలు బంద్...
ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు, విద్యార్థులు...
జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో తక్షణమే మనమత్తులు చేయించాలి
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో వస్తున్న వర్షాలకు సంగెం- కోడూరు, సంగెం- వెంకేపల్లి గ్రామాల మధ్య రెండు వాగులు ఉండడంతో రెండు వాగులు తెగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తుర్క నాగరాజు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు తిమ్మాపురం కొమ్మాల మధ్య చిల్పకుంట, నూతనకల్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
వెంటనే అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు వేసి గ్రామ ప్రజల కష్టాలను తీర్చాలని కోరారు. గ్రామంలో ఎవరికైనా ఎమర్జెన్సీ హాస్పటల్ కి వేరే ప్రాంతానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అధికారులు స్పందించి గ్రామానికి తాత్కాలిక రోడ్డు వేసి ఆదుకోవాలని కోరారు.