15-08-2025 05:52:37 PM
మహబూబ్ నగర్ టౌన్: ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళ డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎన్సిసి విద్యార్థుల కాంటిజెన్స్ తో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి. రాజేంద్రప్రసాద్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ గ్రామాలలో, నగరాలలో, స్కూళ్లలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ప్రజలందరూ ఎంతో గర్వంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారతావానికి జేజేలు పలుకుతున్న ఈ శుభ సంందర్భంలో భారతదేశానికి స్వాతంత్య్రంను తీసుకురావడంలో కృషిచేసిన మహానీయులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ భారత జాతి ఔన్నత్యాన్ని అలాగే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా మన సమైక్యతను మనం ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం ఇవి ఏ విధంగా సంక్రమించాయి అనే విషయాలని ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ జాతీయ నాయకులు స్వాతంత్ర్య ఏర్పాటులో చూపించిన మార్గాలు స్వాతంత్ర్య అనంతరం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో భారత దేశ సుస్థిరమైన అభివృద్ధికై మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు అంటూ తదుపరి భారతదేశం అంచలంచెలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అనడంలో అతిశయోక్తి లేదు అలాగే ఇంతగా అభివృద్ధి చెందుతున్న అనేక సమస్యలు వెంటాడుతున్నాయి పేదరికం, నిరక్షరాస్యత, లింగ భేదాలు, మహిళల పట్ల వివక్షత వంటి సవాళ్లను పరిశీలించగలిగి మార్గనిర్దేశం చూపించేది యువతేనంటూ అందుకే యువత బాగా చదువుకొని విజ్ఞానం సంపాదించుకొని అన్ని రంగాల్లో దేశానికి సేవ చేసే గుణం యువతపైనే ఉందంటూ అందుకు ప్రభుత్వం స్కూళ్లలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో కల్పిస్తున్న అవకాశాలు అప్పటితో పోలిస్తే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.