calender_icon.png 29 May, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

28-05-2025 08:27:14 AM

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు(Yellow alerts) జారీ చేసింది. బుధవారంనాడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సిద్దిపేట, జనగామ, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేసింది.

రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల పల్లి భారీ వర్ష సూచన(Heavy rain forecast) ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌కు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అంచనా వేసిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఐఎండీ హైదరాబాద్‌కు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.