16-08-2025 12:20:08 AM
194 మంది మృతి
ఇస్లామాబాద్, ఆగస్టు 15: భారీ వర్షాలు, వరదలతో పాకిస్థాన్, పీవోకే అల్లకల్లోలం అ వుతున్నాయి. పాక్‌లోని పలు ప్రాంతాల్లో గ డిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు 194 మంది మృతి చెందగా.. పదుల సంఖ్య లో గల్లంతయ్యారు. అనేక మంది గాయాల తో సతమతం అవుతున్నట్టు పాకిస్థాన్ నేషనల్ డిజిస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలి పారు. ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నా యి.
వరదల ధాటికి పలు భవనాలు, బ్రిడ్జిలు, రోడ్లు ధ్వం సమయ్యాయి. ఇక పీవోకేలోని గిల్గిత్ కూడా పరిస్థితులు దిగజారాయి. ఆ కస్మిక వరదల వల్ల ఎనిమిది మంది చనిపో గా, ఇద్దరు తప్పిపోయినట్టు అధికారులు తె లిపారు. కారకోరం, బాల్టిస్తాన్ రహదారులు పలు చోట్ల ధ్వంసం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.