calender_icon.png 16 August, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు

16-08-2025 02:25:44 PM

హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, దేశ అభివృద్ధి కొరకు ఆయన చేసిన అనేక సేవలను గుర్తుచేసి, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రోఖాన్ అణు పరీక్షలు చేసి.. ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నా.. ఎక్కడా వెనకడుగు వేయలేదని రామచందర్ రావు కొనియాడారు. అటు హైదరాబాద్ -బర్కత్ పురలోని బీజేపీ నగర కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పుణ్య తిథి సందర్బంగా వారి దివ్య స్మృతికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) నివాళులు అర్పించారు.