16-08-2025 02:37:49 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ కృష్ణాష్టమి(Krishna Janmashtami)ని పురస్కరించుకుని శనివారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ,యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగేలా నాగేశ్వర్ రావు నివాసంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే పవిత్ర పండుగ అని, శ్రీకృష్ణుడు చూపిన బాటలో అందరు నడిచి తమ తమ జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకోవాలిని కోరారు. భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ మండల అధ్యక్షుడు రవి, ఐలవేణి సంతోష్, బోయిని మల్లేష్, బండి శ్రీనివాస్, వెంకటేష్, మేకల భీమేష్, బలరాం నాయక్, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.