16-08-2025 02:30:07 PM
జహీరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) పురస్కరించుకొని జహీరాబాద్ లో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. భవాని మందిర్ హనుమాన్ మందిర్ రోడ్లలో పుట్లను కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు విద్యార్థులు రాధాకృష్ణ వేషాదారులతో వచ్చి పుట్టిని కొట్టారు. శ్రీకృష్ణుడు జన్మాష్టమి వివిధ గ్రామాలలో కూడా నిర్వహించారు. జన సంఘం మండలం ఏడాకులపల్లిలో జహీరాబాద్ మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తాలూకా గొల్ల కురుమ యాదవ సంఘం నాయకులు రాములన్న, తట్టు నారాయణ, మారుతి, సుభాష్, పాండు, గొల్ల భాస్కర్, నారాయణ విశ్వనాథ్ యాదవ్, ప్రభు యాదవ్, పులేందర్, తదితరులు పాల్గొన్నారు.