16-08-2025 12:36:16 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుంది. నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని శుక్రవా రం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఈ దీపావళి నుంచి సామా న్యులపై జీఎస్టీ భారం తగ్గనుంది. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు రాబోతు న్నాయి. ఈ సంస్కరణలు రైతులు, సామాన్యులు, మధ్యతరగతి, ఎంఎస్‌ఎంఈలకు ఎంతో ప్రయోజనం కలిగించను న్నాయి’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రకటన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. రెండు స్లాబుల్లో జీఎస్టీ ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపింది. స్టాండర్డ్, మెరిట్ వంటి రెండు రేట్లు మాత్రమే ఉంటాయంది. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అంటూ నాలుగు స్లాబుల్లో జీ ఎస్టీ వసూలు చేస్తున్నారు. వచ్చే నెలలో జీఎ స్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది.
5, 18 శాతాలే..
ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబుల స్థానంలో 5 శాతం, 18 శాతం జీఎస్టీ శ్లాబులు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానంతో ప్రస్తుతం 28 శాతం స్లాబు లో ఉన్న 90 శాతం వస్తువులు 18 శాతం స్లాబులోకి రానున్నాయి. 12 శాతం స్లాబు లో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం స్లా బులోకి రానున్నాయని సమాచారం. ఐదు నుంచి ఏడు వస్తువులకు కొత్తగా 40 శాతం పన్ను రేటు వర్తింపజేస్తారని వినికిడి.
ఆరోగ్యానికి హానికరం అయిన తంబాకు, గుట్కా, సిగరెట్ మొదలైన వస్తువులు ఈ స్లాబులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఏసీ లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు మినహాయించబడతాయని తెలుస్తోంది. పె ట్రోలియం ఉత్పత్తులు మాత్రం జీఎస్టీ పరిధిలోకి రావడం లేదని వారు పేర్కొన్నారు.
మూడు ప్రధాన స్తంభాలు..
స్వావలంబన భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు మూడు ప్రధాన స్తంభాల ఆధారంగా జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నారు. నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, జీవన వ్యయాల తగ్గింపు ఆధారంగా బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు ఉపశమనం కలిగించి రీఫండ్ విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతే కాకుండా పన్ను స్లాబుల హేతుబద్ధీకరణ ద్వారా సామాన్యులపై పన్ను భారం కూడా తగ్గనుంది.