calender_icon.png 14 September, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

14-09-2025 06:41:58 PM

నైజాంను తరిమికొట్టి ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నది

నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేది

సాయుధ పోరాట అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,(విజయక్రాంతి): నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చెయ్యకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేదని, సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఐ జిల్లా కార్యదర్శి, మ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. 77 వ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పలివెల, కొరటికల్  గ్రామంలో సాయుధ పోరాట యోధులు కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకు మిరియాల లింగయ్య, నువ్వు ఓటి అంజయ్య అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సిపిఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

సాయుధ పోరాటంలో పాశం పుల్లారెడ్డికి వ్యతిరేకంగా పలివెల గ్రామం నుండి నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన కొండవీటి కుటుంబం పోరాటాలు చేసి నిజాం సర్కార్ నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించారన్నారు. సాయుధ పోరాటం ద్వారానే నిజామును లొంగదీశారన్నారు.సాయుధ పోరాటంలో పలివల గ్రామం నుండి బచ్చిరెడ్డి గుర్నాథ్ రెడ్డి గోస్కొండ పెద్దులు మరో 30 మంది పోరాట యోధులు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. భూస్వాముల దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ దొడ్డు కొమరయ్య అలాంటి ఎందరో యోధులు ధరలకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన భూమికోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో నిరుపేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన ఘనత కమ్యూనిస్టులు అని అన్నారు.భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం నవాబును భారత ప్రభుత్వం గౌరవించడం ఏంటని ప్రశ్నించారు. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే హైదరాబాద్ మరో పాకిస్తాన్ల మారేది అని తెలిపారు. సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుందని సాయుధ పోరాటానికి బిజెపికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు