02-07-2025 12:31:18 AM
న్యూఢిల్లీ, జూలై 1: వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న వేళ మం గళవారం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి బెంగళూ రు నుంచి ఇండిగో విమానం 200 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయల్దేరింది. అయితే కాసేపటికే ప్రతికూల పరిస్థితులను గుర్తించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయాలని భావించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించి ఫ్లుటైను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి వి యన్నాంకు బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఒక్కసారిగా 900 అడుగుల మేర కిందకు దిగడం సంచలనం కలిగించింది. అయితే గత జూన్ 14నే ఈ ఘటన చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.