calender_icon.png 23 January, 2026 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతరకు హెలికాప్టర్

23-01-2026 12:00:00 AM

  1. సేవలను ప్రారంభించిన మంత్రి సీతక్క
  2. హనుమకొండ నుంచి మేడారం రాకపోకలకు ఒక్కొక్కరికి రూ.35,999 ఛార్జీ 

మేడారం, జనవరి 22 (విజయక్రాంతి): దక్షిణాది కుంభమేళగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు భక్తులు తక్కువ సమయంలో వెళ్లి రావడానికి హెలికాప్టర్ సేవలను హనుమ కొండ నుంచి మేడారం జాతరకు తుంబి ఎయిర్ లైన్స్ హెలికాప్టర్ సేవల ను అందుబా టులోకి తెచ్చింది. గురువారం హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరకు తాము చిన్నతనంలో కాలినడకన వెళ్లే వారమని, మూడు రోజుల పాటు నడిచేవారమని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. కాగా ఈ నెల 31వ తేదీ వరకు భక్తులకు ఈ సేవలు అందుబా టులో ఉంటాయి.

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి మేడారం వరకు రాను పోను ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.35,999 ఛార్జీ వసూలు చేస్తారు. ఈ సేవలు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుం చి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉం టాయి. టిక్కె ట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం భక్తులు https://www.helitaxii.com లేదా 8530004309, 9676320139 నంబర్ల లో సంప్రదించవచ్చు.

మేడారం జాయ్ రైడ్స్

మేడారం పరిసరాలను ఆకాశం నుంచి వీక్షించాలనుకునే వారి కోసం ‘జాయ్ రైడ్స్’ కూడా ఏర్పాటు చేశారు. మేడారం సమీపం లోని పడిగాపూర్ హెలిప్యాడ్ నుంచి ఈ రైడ్ ప్రారంభమవుతుంది. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ విహంగ వీక్షణా నికి ఒక్కో వ్యక్తికి రూ.4,800 ఛార్జీగా నిర్ణయిం చారు. జాతర వైభవాన్ని ఆకాశం నుంచి చూడా లనుకునే భక్తులకు ఇది ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

భక్త జనసంద్రంగా మేడారం 

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మరో ఐదు రోజులే గడువు ఉండగా గురువారం ముందస్తు మొక్కు లను తీర్చుకోవ డానికి భక్తులు పెద్ద ఎత్తున మేడారం తరలివ చ్చారు. కొద్దిరో జులుగా ముందస్తుగా వనదేవతల దర్శ నం కోసం భక్తుల రాక కొనసా గుతూనే ఉంది. జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరిం చడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో కిక్కిరిసి పోయిం ది.

మేడారం జాతర ప్రాంగణం భక్తజ నంతో నిండి సందడిగా మారింది. సీపీ ఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారా యణ గురువారం సమ్మ క్క సారలమ్మ జాతరకు వచ్చారు. ఎత్తు బంగారం (బెల్లం) వనదేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. సమ్మక్క సారలమ్మలు స్వేచ్ఛ, సమాన త్వం, శాంతి, ఐకమత్యం కోసం పోరాడిన వీర వని తలని కొనియాడారు.