calender_icon.png 28 October, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస

28-10-2025 01:54:30 PM

20 రోజులు గడుస్తున్న ముందుకు కదలని వడ్ల కాంటాలు

అధికారుల నిర్లక్ష్యంతో.. ధాన్యం కొనని మిల్లర్లు

కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్

తుంగతుర్తి (విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు, చివరి దశలో చేతికి వచ్చిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలకు వెళితే ప్రస్తుతం రైతుల గోస అనుభవిస్తున్నారు. తుంగతుర్తి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులు గడుస్తున్న పూర్తిస్థాయిలో కాంట మొదలు కాకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో, పూర్తిస్థాయిలో మిల్లులు అనుమతి రాకపోవడంతో, ప్రస్తుతం రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు చందంగా మారింది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యం తుఫాను రావడంతో, ఎండబెట్టుకొని పట్టుకున్న ధాన్యం కూడా తడవడంతో, ధాన్యం మొలకెత్తి  రైతులు లబోదిబోమని ఏడుస్తున్నారు. దీనికి తోడు ప్రతి సెంటర్లో ధాన్యం పట్టుకునే మిషన్లు కూడా, పూర్తిస్థాయిలో నడవక, మురాయిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరి ధాన్యం తేమ శాతం కేవలం 17 శాతమే ఉండాలని, నిబంధనలు పెట్టగా, ప్రస్తుతం రైతుల వరి ధాన్య పరిస్థితులు, తారుమారుగా మారాయి. గడచిన మూడు రోజులుగా తుఫాన్ ప్రభావం తుంగతుర్తి మండలంలో ఎక్కువగా ఉండడంతో, రైతులు కప్పుకున్న ధాన్యం రాశులు కూడా తడిచాయి.  తుఫాన్ ప్రభావంతో రైతులు 25 శాతం ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని,డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికపై రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల రైతుల డిమాండ్ చేస్తున్నారు. 

అకాల వర్షంతో ధాన్యం తడిసి మొలకెత్తింది: లక్ష్మీ రైతు తుంగతుర్తి 

గడచిన 15 రోజులుగా సొసైటీ కేంద్రంలో ధాన్యం పోశాను. కాంటాలు సాగే తరుణంలో తుఫాన్ ప్రభావంతో ధాన్యం తడిసి మొలకెత్తిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

15 రోజులు గడుస్తున్న... కాంటాలు కాకపాయ: కోదాటి మోహన్ రావు తుంగతుర్తి 

15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకుని వచ్చాను. మంచిగా ఆరి కాంటా పెట్టే సమయంలో అకాల వర్షం కురియడంతో, ధాన్యం తడిసింది ఇబ్బందుల గురవుతున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాం.