అగస్త్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగస్త్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ప్రజలకు ఉచితంగా బైక్ హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించేలా ప్రోత్సహించ డం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని హా స్పిటల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏసీపీ వనస్థలిపురం కాశీ రెడ్డి, సీఐ రవి బాబు, ఓంకార్ నగర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు బుచ్చి రెడ్డి,
అగస్త్య హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ రామ్ కమల్, డాక్టర్ అనిల్ మాదటి, డాక్టర్ రాహుల్ రాఘవాపురం, డాక్టర్ సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్ పాశం, డాక్టర్ హరీష్ తదితరులు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు అడ్వకేట్ యూవీ సురేష్ కుమార్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. కాగా హాస్పిటల్ పీఆర్ టీమ్ తిరుమలేష్, శ్రీనివాస్, ఏ. సత్యనారాయణ, కె. శ్రీనివాస్, రాజశేఖర్ హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.






