calender_icon.png 26 July, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలకు చేయూత

26-07-2025 12:03:37 AM

తుర్కయంజాల్, జులై 25:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు క్యూబ్ ఫోర్స్ ఫౌండేషన్ చైర్మన్ కుషాల్ రెడ్డి చేయూతనందించారు. విద్యార్థుల కోసం 35 డ్యూయల్ డెస్కులు కుషాల్ రెడ్డి అందజేశారు.

రెండునెలల కింద రూ.5లక్షలతో షెడ్డు, కిచెన్ నిర్మాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయు రాలు తిరుపతిబాయి మాట్లాడుతూ తన స్వ గ్రామంలోని పాఠశాలకు ఎంతోకొంత సా యం చేయాలన్న తపన కుషాల్ రెడ్డికి ఉం డటం అభినందనీయమన్నారు.

దాతల సా యంతో పాఠశాలలో అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నామన్నారు. పాఠశాల అభివృద్దికి దాతల సహకారం ఎంతో అవసర మన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు దన్నెరాజు, లక్ష్మణ్, అమర్ సింగ్, గోపాల్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.