calender_icon.png 20 August, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరు వ్యాపారులకు చేయూత

20-08-2025 07:25:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు డాక్టర్ వెనిగళ్ళ జగన్మోహన్ రావు లావణ్య దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని చిరు వ్యాపారులకు ఎండా వాన నుండి రక్షించే గొడుగులను పంపిణీ చేశారు. పలువురు చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు పట్టణ పరిధిలోని ఇందిరాగాంధీ, నెహ్రు, శ్రీనివాస థియేటర్ సెంటర్లలో జీవనం సాగిస్తుండగా వారికి చేయూతను అందించడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న, సెక్రెటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కర్ణాకర్ రెడ్డి, డాక్టర్ రాజ్ కుమార్, అనుముల వెంకటేశ్వర్లు, పమ్మి సనాతన చారి, సురేష్ బాబు, కాశీనాథ్, నవీన్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.