20-08-2025 07:24:48 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో నిర్మల్ కు చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులకు పలు పదవులు వచ్చినట్లు సంఘ సభ్యులు తెలిపారు రాష్ట్ర అధ్యక్షునిగా రాము శర్మ ప్రధాన కార్యదర్శిగా వైద్య ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నిర్మల్ నుండి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సిరిగ రవీందర్, వెంకటప్పయ్య ఖానాపూర్ సిరిగ రమేష్ విజయ్ కుమార్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుణవంతురావ్ జోషి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా సిరిగ రవీందర్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పాలకులకు విన్నవిస్తూ బ్రాహ్మణ సమాజానికి ఈడబ్ల్యూఎస్. EWS ప్రభుత్వ స్కీమ్లో సంబంధించిన అన్ని కూడా అర్హులైన బ్రాహ్మణులకు అందించడానికి కృషి చేస్తానని జాయింట్ సెక్రటరీగా నన్ను మరియు నాతోటి పెద్దలను ఇక గ్రీవంగా ఎన్నుకొనుటలో సహకరించిన నిర్మల్ బ్రాహ్మణ సమాజానికి మరియు రాష్ట్ర లోని అన్ని బ్రాహ్మణ సంఘాలకు మరియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను