20-08-2025 07:26:37 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఉత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు చేకూర్తీ శంకరయ్య, అయిత తిరుపతిరెడ్డి, ప్రచార కమిటీ సభ్యుడు కడార్ల నాగరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్ రావు, వరప్రసాద్, గుడాల శ్రీనివాస్, కోట సమ్మయ్య, వడ్ల సమ్మయ్య, సూరి తదితరులు పాల్గొన్నారు.