calender_icon.png 2 June, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అదిగో పులి.. ఇదిగో తోక..’ పీసీసీ పదవులు

01-06-2025 12:45:31 AM

తెలంగాణలో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ  కూర్పు, మంత్రి వర్గవిస్తరణ సంగతి ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అన్న చందాన ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ రెండు అంశాలపై నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మరికొద్ది రోజుల్లో ప్రకటించడం, హస్తినాపురికి వెళ్లి పెద్దలతో చర్చలు జరిపామనడం.. ఆ తర్వాత మిన్నకుండటం.. కొన్ని నెలలుగా ఇదే పరిపాటిగా జరుగుతూ వస్తున్నది.

కొందరు పార్టీ పెద్దల కరుణాకటాక్షా లు, దర్శనభాగ్యం ఇవ్వకపోవడం వల్లే పదవుల కేటాయింపు ఆలస్యమవుతూ వస్తున్న దని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఈ అంశాలు ధారావాహికలా కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడుతు న్నా రు.

మొత్తానికి పదవుల కేటాయింపు ఆశావహుల ఓపికకు పెద్ద పరీక్షగా మారిం ది. సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఈనెల 4న మరోసారి సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఈ దఫా అయినా తీపికబురు వస్తుందని వారం తా ఆశిస్తున్నారు. ఇక అంతా.. పార్టీ పెద్దల దయ. రమేశ్ మోతె