13-08-2025 12:17:16 AM
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధ్వజం
ఆదిలాబాద్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పచ్చగా మారిన పల్లెలు నేడు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారుతున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం నేరడిగొండ మండ లంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మె ల్యే మొక్కలు నాటి, నీరు పోశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడు తూ నేడు పల్లెలలో దోమల బెడదతో ప్రజ లు మలేరియా, విష జ్వరతో మళ్ళీ మంచానికి పరిమితం అవుతున్నారన్నారు. కేసీఆర్ హయంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు ఉండేవనీ, గ్రామలు పచ్చదనం పరిశుభ్రతతో కళ కళలాడేవనీ, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎక్కడ చూసినా విష జ్వరాలు, ఎండిపోయిన పల్లె ప్రకృతి వనలు మురుగున పడ్డ గ్రామ పంచాయతీ పాలనలె కనిపిస్తున్నాయని ఆరోపించారు.
ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి, పాలనపై నిబద్ధత ఉంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి, గత రబీ కాలం నాటి రైతు బందు రైతులకు వేసి, ఆరు గ్యారంటీలు అమలు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, అనిల్ అన్న యువ సైన్యం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షలు రవీందర్ రెడ్డి, ఆదిముల్లా భూషణ్, ప్రతాప్ సింగ్, సురేందర్ రాథోడ్, గులాబ్ సింగ్, సంతోష్ సింగ్,, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.