16-08-2025 11:00:50 PM
పెన్ పహాడ్: మండలంలోని అన్నారం బ్రిడ్జి, అనాజపురం గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ చెందిన బాధిత కుటుంబాలను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి శనివారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అన్నారంబ్రిడ్జి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మీసాల లచ్చయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మీసాల గుర్వమ్మ, అలాగే అనాజీపురంకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆదిరెడ్డి జానకి రాంరెడ్డి పితృమూర్తి ఆదిరెడ్డి మల్లారెడ్డి మృతి చెందాడు. ఈ మేరకు ఎమ్మెల్యే విచ్చేసి మృతుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిబాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, pacs చైర్మన్లు వెన్న సీతారాం రెడ్డి, నాతాల జానకి రాంరెడ్డి, జీడీ బిక్షం, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, కొండా జానకిరాములు, ఎగ్గడి మురళి తదితరులు ఉన్నారు.