16-08-2025 11:23:34 PM
కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కోటపల్లి మండలం ఎదులబంధం జీపీ పరిధిలోని తుంతుంగ వాగు సమీపంలో గల చెరువు నీటి వల్ల దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డును తహసిల్దార్ రాఘవేందర్ రావు, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
నీటి ప్లో తగ్గిన తరువాత పైపులు వేసి తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉదృతంగా ప్రవహించే నదులు, వాగుల వద్దకు ఎవరు వెళ్లకూడదని, పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు ఆగిన తర్వాత దెబ్బతిన్న రోడ్డు ప్రాంతంలో కల్వర్టు మంజూరు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.