calender_icon.png 17 August, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి

16-08-2025 11:11:35 PM

ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీల జోక్యం ఆపాలి

కలెక్టర్ కు లేఖ రాసిన మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు

మంచిర్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారని, అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు శని వారం లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సందర్భాలలో అధికారుల సమక్షంలో ప్రభుత్వ కార్యక్రమాలలో వారే ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రభుత్వ నుంచి వస్తున్న చెక్కులను అందజేస్తు పేపర్లలో వార్తలు వస్తుండటంతో ప్రజలలో దీనిమీద చర్చ జరుగుతుందని, ఈ విధానం తప్పని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేస్తు, ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత అధికారి మీద చర్య తీసుకోవాలని కోరారు. అలా జరిగిన కొన్ని సందర్భాలను తెలిపారు.

మంచిర్యాల గార్డెన్స్ లో ఈ నెల 15న జరిగిన కళ్యాణ లక్ష్మి, పాదీ ముబారక్ చెక్కులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేతుల మీదుగా పంపిణీ చేశారని, షాదీ ఖానా హాలులో జూలై 24న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఏప్రిల్ 1న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యకురాలు చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగిందని, దానికి సంబంధించిన వార్తా కథనాలు మీకు పంపియడం జరుగుతుందని పేర్కొన్నారు. 

అంతే కాకుండా రేషన్ షాప్ ముందు ఎలాంటి ప్రోటోకాల్ లేని కాంగ్రెస్ నాయకుల ప్లెక్సీలు పెట్టారని, ఈ విధంగా అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా వారి ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొంటురన్నారని, దీనిని మేము తప్పుపడుతున్నామని, సదరు అధికారులపై వెంటనే చర్య తీసుకొని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని కోరుతున్నామన్నారు.