calender_icon.png 17 August, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృంగిన చెరువు కట్ట

16-08-2025 11:18:23 PM

ఆందోళనలో ఎరిజర్ల గ్రామస్తులు 

మరిపెడ,(విజయక్రాంతి): భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎరిజర్ల చెరువు కట్ట కృంగింది. గత వర్షాకాలంలో భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోగా నెల రోజుల క్రితం మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతులు సరిగా నిర్వహించకపోవడం, నాణ్యత పాటించకపోవడం వల్లే మళ్లీ చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే దెబ్బతిన్న చెరువు కట్టకు మరమ్మతులు నిర్వహించకపోతే పెను ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.