16-08-2025 11:07:48 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 29వ వార్డు (డబ్బు సేట్ లైన్) కు చెందిన ఆటో డ్రైవర్ బండారి మల్లికార్జున్ తీవ్ర అనారోగ్యంతో రెండు కాళ్లను కోల్పోయిన విషయాన్ని తెలుసుకొని శనివారం రాత్రి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ అతన్ని పరామర్శించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మల్లికార్జున్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని చెప్పారు. శాసనసభ్యులు వినోద్ వెంట టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, నాయకులు దావ రమేష్, రామిల్ల ప్రదీప్ లు ఉన్నారు.