16-08-2025 11:05:00 PM
క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు
మహబూబాబాద్,(విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా జిల్లా అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారుల్లో పలువురు శనివారం కార్య స్థానాల్లో విధులు నిర్వహించారు. మండల స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిని అలర్ట్ చేసి, వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.