16-08-2025 11:35:43 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకృష్ణుని చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణ ధరించారు.