calender_icon.png 17 August, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్ దాటుతుండగా కదిలిన రైలు

16-08-2025 11:14:26 PM

కానిస్టేబుల్ దుర్మరణం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆగి ఉన్న గుర్తు రైలు కింద నుండి రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రైలు కదిలిన ఘటనలో కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇదే జిల్లా నర్సింహాల పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ శుక్రవారం రాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద నుంచి దాటుచుండగా అదే సమయంలో గూడ్స్ రైలు కదలడంతో ప్రమాదవశాత్తు చనిపోయినాడు.

ఎలాంటి ఐడెంటిఫికేషన్ కార్డు జేబులో లేనందున జీఆర్పి పోలీసులు మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ మార్చిరిలో భద్రపరిచారు. శనివారం  ఉదయం 11.00 గంటలకు ఏరియా హాస్పిటల్ లో పనిచేయుచున్న దేవేందర్ అనే సెక్యూరిటీ గార్డు గుర్తుపట్టి గూడూరు ఏఎస్ఐ బిచ్చా నాయక్ కు ఫోటోలను పంపగా మృతుని ఫోటోలను చూసి  నరసింహులపేట కానిస్టేబుల్ హరి ప్రసాద్ గా నిర్ధారించారు.