calender_icon.png 16 August, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

13-08-2025 12:17:20 AM

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పేర్కొన్నారు.  మంగళవారం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 53 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల ను ఆపడం లేదని ఆయన  గుర్తు చేశారు.  సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు, సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, మాధవ రెడ్డి, గోవింద్ యాదవ్, నాగరాజు, రాజు గౌడ్, పోతన్ పల్లి మోహన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.