calender_icon.png 17 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముప్పు పొంచి ఉంది.. అప్రమత్తంగా ఉండాలి

16-08-2025 11:27:36 PM

జిల్లా ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం 

ఖమ్మం,(విజయక్రాంతి): ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకి వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు 14.75 అడుగుల మేర ప్రవహిస్తోంది అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను ఆదేశించారు.

పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు తెలిపారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న 12 డివిజన్ల లో ప్రజలకు అవసరమైన అత్యవసర తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్,  ఉన్నతాధికారుల ను మంత్రి తుమ్మల సూచించారు.