9 April, 2026 | 4:19 AM

హరీష్ రావు గొల్లపల్లి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి

09-04-2026 01:43 AM

వనపర్తి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హరీష్ రావు గొల్లపల్లి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి లభించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లు అహింసాయుతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదన్నారు. పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవాలని, పాలకుల వత్తిళ్లకు లొంగి పనిచేయవద్దన్నారు. గురువారం నిర్వహించనున్న గొల్లపల్లి బహిరంగ సభ విజయవంతం చేయడానికి రైతాంగం, ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.