calender_icon.png 19 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ ధ్యేయం

19-11-2025 07:31:44 PM

ఆర్ధిక సంక్షోభంలోను అమలవుతున్న సంక్షేమ పథకాలు

పేదలపాలిట పెద్ద దిక్కుగా నిలిచిన సీఎం సహాయనిధి

పార్టీలకు అతీతంగా చెక్కులను పంపిణీ చేస్తున్నాం

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): గతపాలకుల హయాంలో జరిగిన ఆర్ధిక సంక్షోభం వల్ల ప్రజలుకు ఇబ్బంది కలగకూడదని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేయడం లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి 11, 29 డివిజన్ ల వరంగల్ మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.42,59,096/-ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

సహాయం అని కోరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి, ఇతరత్రా సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పర్సంటేజ్ లేకుంటే పనులు కాకపోయేవి కానీ పారదర్శకంగా ప్రజా ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయని అన్నారు.

న్యూశాయంపేటని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం

31 వ  డివిజన్ న్యూశాయంపేటను గడిచిన రెండేళల్లో అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందు వరుసలో ఉంచుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి న్యూ శాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.60 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణనికి భూమి పూజా చేశారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబధిత అధికారులని ఆదేశించారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న డివిజన్ని గతంలో ఎవరు పట్టించుకోలేదని గడిచిన రెండేళ్లలో అత్యధికంగా నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ లు మోహన్ రావు, శివ శంకర్, డివిజన్ అధ్యక్షులు సురేందర్, సీనియర్ నాయకులు, కార్యకర్తులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.