15-09-2025 01:06:18 AM
ముషీరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): అధికార భాషగా హిందీ ఈదేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హింది జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం జరిగి ంది.
కాంగ్రెస్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ ఛైర్మన్ రాజేశ్ కుమార్ అగర్వాల్, తెలంగాణ హింది జర్నలిస్టు అసోసియేషన్ అధ్య క్షులు ఎంఎన్‌ఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌరవ అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు హార్కర్ వేణుగోపాల్ రావు, ఎఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్ర ప్రణాళిక కమిషన్ చైర్మన్ డాక్టర్ చిన్నా రెడ్డి, మాజీ ఎంపి వి. హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహెర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కొంద రూ తమ స్వార్థ రాజకీయాల కోసం కులా లు, మతాల పేరిట ఈ దేశాన్ని విచ్ఛినం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అనేక భాషాలకు నిల యమైన మన దేశంలో అత్యధిక జనాభా మాట్లాడేది హిందీభాషా కావడంతోనే ఆనాడే దేశ అధికారిక భాషగా గుర్తించబడిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్ర మంలో తెలంగాణ హింది జర్నలిస్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎ సర్వర్, ప్రదిప్ సురానా, లక్ష్మినారాయణ రాఠీ, సిఎ మురళి మనోహర్ పలోడ్, బీమ్ అగర్వాల్, మహావీర్ అగర్వాల్, మధు సూదన్ సన్తూలియా, సురేశ్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
పలువురికి అవార్డులు..
హిందీ దివాస్ సందర్భంగా పలువురికి అవార్డులను ప్రధానం చేశారు. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ అవార్డును కవి, జర్నలిస్టు అర్వింద్ యాదవ్ కు ప్రధానం చేశారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్టు సదాశివ శర్మ అవార్డును మిఢనైట్ రిపోర్టర్ డాక్టర్ చైతన్యసింగ్, విద్యారణ్య హరిబెలికే అవార్డును హిందీ కవి మీనా లలిత్ ముతాకు అందజేశారు.