calender_icon.png 23 May, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 సంవత్సరాల ఆలయం

01-05-2024 12:05:00 AM

400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం హైదరాబాద్‌లోని జియాగూడలో  మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ శైలిలో నిర్మించబడింది  నంగనూర్ ప్రథమ పీఠం ద్వారా స్థాపించబడిన ఆలయాల్లో ఈ ఆలయమే మొదటిది. నంగనూర్ పీఠంలో శ్రీవైష్ణవ సంప్రదాయం తెలిసిన అర్చకులు అందుబాటులో లేకపోవడంతో, శ్రీరంగంలోని వన మామలై పీఠం నుండి అర్చకులు నిత్య పూజలు నిర్వహించేందుకు హైదరా బాద్ వచ్చారు.   

2015ఫిబ్రవరిలో, తెలంగాణ దేవాదాయ శాఖ కార్యదర్శి ద్వారా మూడు సంవత్సరాల కాలానికి రిలిజియస్‌అండ్‌చారిటబుల్ ఎండో మెంట్స్ చట్టంలోని సెక్షన్ 15,29 కింద ఆలయానికి మిన హాయింపు ఇచ్చారు. మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో  ద్రవిడ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. మూడు అంచెల రాజ గోపురం, మధ్య మందిరంలో రంగనాథుని రాతి చిత్రం ఉంటుంది, ఇది శేషతల్పంపై నిద్రించే విష్ణువు రూపం. హనుమంతుడు,  గరుడుడు కాకుండా లక్ష్మి (రంగనాయకిగా), ఆండాళ్ కోసం ప్రత్యేక మందిరాలు ఉన్నాయి .  గరుడుని గుడి వెనుక  పంచలోహలతో చేయబడిన ద్వజస్తంభం ఉంటుంది . గర్భగుడిపై విష్ణువు దశావతారాల చిత్రాలు చూసి తీరాల్సిందే.