calender_icon.png 2 November, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

01-11-2025 12:00:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖ  ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవి, ఎయిడ్స్ తో సంయుక్తంగా అవగాహన నడక, బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం నుండి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై. శ్రీదేవి, డాక్టర్ ఎన్. ఫణీందర్, ఎం. సంజీవ్,  టి. దుర్గ శ్రీనివాస్, కె. గణేష్ హాజరై పాల్గొన్నవారిని ఉత్సాహపరిచారు.

ఈర్యాలీలో అనురాగ్ యూనివర్సిటీ తరపున డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్‌ఎస్‌ఎస్ అధికారి, ఎన్‌ఎస్‌ఎస్ శిక్షకులు,  వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.